Posts

Showing posts from August, 2020

సుప్రీం చీఫ్ జస్టిస్‌పై ట్వీట్‌లు.. ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన కోర్టు

 సుప్రీం చీఫ్ జస్టిస్‌పై ట్వీట్‌లు.. ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన కోర్టు Gvn Apparao | Samayam Telugu Updated: 14 Aug 2020, 12:39:00 PM సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈకేసులో ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేల్చింది.   ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్‌లు చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌‌ను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారీల ధర్మాసనం ఈ మేరకు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణ శుక్రవారం పూర్తిచేసిన సుప్రీంకోర్టు.. ఆయనకు ఆగస్టు 20 కేసు ఖరారుచేయనుంది. అయితే, వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. ఆగస్టు 3న దాఖలుచేసిన అఫిడవిట్‌లో తాను ట్వీట్ చేసిన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే చింతిస్తున్నానని, ఉన్నతాధిక...