భారతదేశ ప్రజలమగు మేము...
భారతదేశ ప్రజలమగు మేము... 06-02-2020 00:22:28 రాజ్యాంగాన్ని చదువుదాం. దాని విస్తృతిని, ఔదార్యాన్ని, పరిమితిని కూడా అవగాహన చేసుకుందాం. వాటికి తరువాతి వారు చేసిన సవరణల మంచిచెడ్డలను తెలుసుకుందాం. ఇష్టమొచ్చిన అన్వయాలు ఇచ్చి, వక్రీకరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలు ఎట్లా నడిచాయో, ఎట్లా మౌలిక విధానాలనే మార్చాయో విశ్లేషించుకుందాం. రాజ్యాంగ గ్రంథం అట్ట మీద దేవుళ్ల బొమ్మలుండేవని ప్రేలాపనలు పేలే ప్రజాప్రతినిధుల స్థాయిని తెలుసుకుందాం. సమాజంలో చెలరేగుతున్న ప్రతీపధోరణులకు రాజ్యాంగంతోనే చికిత్స చేద్దాం. బాగా తెలిసిన పుస్తకమే. చాలా సార్లు చూసి ఉంటాను. కొన్ని సార్లు తిరగేసి కూడా ఉంటాను. కొన్ని సార్లు అవసరమైన చోట్ల శ్రద్ధగా చదివి ఉంటాను. కొన్ని భాగాల మీద వ్యాఖ్యలు, విశ్లేషణలు కూడా చేసి ఉంటాను. అనేక సందర్భాలలో ఉటంకించి ఉంటాను. గౌరవించిన పుస్తకమే. అంతగా జీర్ణించుకున్న పుస్తకమో, హత్తుకున్న పుస్తకమో కాకపోయి ఉండవచ్చు. కానీ, ఈ మధ్య నిజామాబాద్‌లో ఒక సదస్సుకు హాజరైనప్పుడు నిర్వాహకులు మెమెంటోగా ఆ పుస్తకం ఇస్తున్నప్పుడు మాత్రం అనిర్వచనీయమైన ఉద్వేగం కలిగింది. భారత రాజ్యాంగం ఆ తరువాత హైదరా...